– మున్సిపల్ ఛైర్పర్సన్ జూపల్లి శశికళ
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్యం కార్మికులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అశ్వారావుపేట మున్సిపల్ ఛైర్పర్సన్ జూపల్లి శశికళ సూచించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో తన అధ్యక్షతన నిర్వహించిన పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం లో ఆమె పాల్గొన్నారు.
అశ్వారావుపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ రాం దాసు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు అందిస్తున్న ఉచిత వైద్య సేవలను అందిపుచ్చుకోవాలని ముఖ్యంగా ఆభా(ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఎకౌంట్) కార్డులను ప్రభుత్వం జారీ చేస్తున్నదని అందుకు ప్రతి ఒక్క కార్మికుడు ఈ ప్రొఫైల్ ను నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ ప్రొఫైల్లో వివరాలను నమోదు చేసుకున్న కార్మికులు అనారోగ్యనికి గురైతే వారికి ప్రభుత్వం గుర్తించిన 340 వైద్యశాలలో 200 నుండి 350 వరకు పలు రకాల వ్యాధుల నుండి చికిత్స పొందవచ్చు అని తెలిపారు. ఆబా కార్డును సద్వినియోగం చేసుకొని కార్మికుల కుటుంబాలు నిత్యం ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వడేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



