Sunday, May 18, 2025
Homeట్రెండింగ్ న్యూస్తల్లిదండ్రులను చూడాల్సాన బాధ్యత ప్రతి ఒక్కరిది

తల్లిదండ్రులను చూడాల్సాన బాధ్యత ప్రతి ఒక్కరిది

- Advertisement -
  • – జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్ రావు

నవతెలంగాణ  ఆర్మూర్ 

జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ,సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కరరావు అన్నారు. మండలంలోని అంకాపూర్ గ్రామ పొద్దుటూరి సదానంద రెడ్డి వృద్ధాశ్రమాన్ని శనివారం సందర్శించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధులకు చిన్న పిల్లల వంటి మనస్తత్వం ఉంటుందని ,వారిని గౌరవించాలని చట్టంలో వారికి పొందపరచిన ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మీడియేషన్ సెంటర్ ప్రతినిధులు బాబా గౌడ్, గుజరాతి నివేదన్, అశోక్, సుదర్శన్ గౌడ్ ,మేనేజర్ రాజన్న, న్యాయ సేవా సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -