Sunday, January 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఒక్కరిలో శక్తి ఉంటుంది.. ఆ శక్తిని మనం వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరిలో శక్తి ఉంటుంది.. ఆ శక్తిని మనం వినియోగించుకోవాలి

- Advertisement -

– రిటైర్డ్ ఎంఈఓ గుండోజి దేవేందర్
– విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అందజేత 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ప్రతి ఒక్కరిలో శక్తి ఉంటుందని…ఆ శక్తిని మనం వినియోగించుకోవాలని రిటైర్డ్ ఎంఈఓ గుండోజి దేవేందర్ అన్నారు. ఆదివారంమండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు అమెరికాలోని తన మనవరాలి కోరిక మేరకు స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ లను సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ చేతుల మీదుగా  అందజేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంఈఓ గుండోజి దేవేందర్ మాట్లాడుతూ మల్లవత్ పూర్ణ, నాట్య మయూరి సుచంద్ర లను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు భవిష్యత్తులో పైకి ఎదగాలన్నారు.కష్టపడి బాగా చదివి పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారిని గంగామణి, ఉపాధ్యాయులు సునీత, కౌశల్య, వీణ, స్వప్న, సరిత, శ్రీలత, దీప, ప్రీతి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -