Wednesday, March 4, 2026
E-PAPER
Homeసినిమాఅందరికి కనెక్ట్‌ అవుతుంది

అందరికి కనెక్ట్‌ అవుతుంది

- Advertisement -

శ్రీనాథ్‌ మాగంటి హీరోగా బాల సతీష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్‌ హౌస్‌ మల్లేష్‌’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్‌. కనకమేడల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రాజేష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 6న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రీరిలీజ్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు.
హీరో శ్రీనాథ్‌ మాగంటి మాట్లాడుతూ,’ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు ఒక ఊర్లో ఉన్న ఫీలింగ్‌లోనే ఉంటారు. మిమ్మల్ని ఎంటర్టైన్‌ చేయడం కోసమే మా జీవితాలు అంకితం. నిజాయితీతోనే ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం’ అని అన్నారు.
‘చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశాను. ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అని నిర్మాత రాజేష్‌ చెప్పారు.
హీరోయిన్‌ గాయత్రి రమణ మాట్లాడుతూ,’జ్యోతి అనే అమ్మాయి మల్లేష్‌ జీవితంలో ఎంత కీ రోల్‌ ప్లే చేసిందనేదే నా క్యారెక్టర్‌. డైరెక్టర్‌ చాలా అద్భుతంగా చూపించారు. అందరూ రిలేట్‌ చేసుకునే క్యారెక్టర్‌ ఇది. శ్రీనాథ్‌తో వర్క్‌ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌ తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ కనెక్ట్‌ అవుతుంది’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -