నోటీసులిచ్చి అరెస్ట్ చేస్తే బాగుండేది : టి.జగ్గారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మంత్రులు, ఉన్నతాధికారులపై ఆధారాల్లేకుండా కించపరిచే విధంగా కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలను ప్రతిఒక్కరూ ఖండించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అర్థరాత్రి సమయంలో ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్ట్ చేయాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ముందుగా నోటీస్ జారీచేసి అరెస్ట్ చేస్తే బాగుండేదన్నారు. సిట్ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఒక మహిళా అధికారిపై ఇష్టాను సారంగా రాయడం, ప్రసారం చేయడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
అరెస్టు అప్రజాస్వామికం బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌రావు
అర్ధరాత్రి సమయంలో విమానాశ్రయంలో ముగ్గురు ఎన్‌టీవీ జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని బీజేపీ అధ్యక్షులు ఎన్. రాంచందర్‌రావు ఖండించారు. ఇది రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛపై, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని, అలాగే వారి ‘ఇందిరమ్మ రాజ్యం’ ఎంత భయంకరంగా బయటపెడుతోందని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛను అణిచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ వ్యవహరంపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర మంత్రులు జి కిషన్‌రెడ్డి, బండి సంజరుకుమార్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల అరెస్టు అక్రమమని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్‌వీ సుభాష్ పేర్కొన్నారు.
ఆ కథనాలను అందరూ ఖండించాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



