నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ప్రతి ఒక్కరూ ఇంటి వారు కావాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ లక్ష్యంగా పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తంగళ్ళపల్లి మండలం లో రెండో విడత క్రింద 500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఉత్తర్వులు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కేకే మహేందర్ రెడ్డి తో కలిసి కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను లబ్దిదారులు 30 రోజులు లోగా ప్రారంభించీ, వచ్చే దసరా దీపావళి పండుగలు నూతన గృహములలో జరుపుకోవాలని లబ్దిదారులకు సూచించారు. తంగళ్ళపల్లి మండలంలో 602 ఇండ్ల లబ్ధిదారులకు నిర్మాణ ప్రొసీడింగ్స్ పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ ఇండ్ల నిర్మాణాల కోసం ఉచితంగా ఇసుకను కూడా అందిస్తున్నట్లు వారి పేర్కొన్నారు. ప్రభుత్వ విధి విధానాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు.
ప్రతి ఒక్కరూ ఇంటి వారు కావాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES