Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వనమహోత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే తోట

వనమహోత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘వన మహోత్సవంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు అన్నారు. పెద్ద కొడపగల్ మండలంలోని జగన్నాథ్ పల్లి గ్రామంలో అటవీశాఖ అధికారులు నిర్వహించిన వన మహోత్సవంలో స్థానిక నాయకులతొ, అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. చెట్ల శాతం పెరిగితే మనుషులకే కాకుండా జంతువులు పశువులకు కూడా జీవించడానికి అనుకూల వాతావరణం లభిస్తుందానీ అన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలైన నాటి వాటిని జాగ్రత్తగా సంరక్షించాలి అని ఆయన సూచించారు. వృక్షాల శాతం తక్కువగా ఉండడంతో పర్యావరణ సమస్యలు పెరుగుతున్నాయని, అందుకే బాధ్యతగా మనందరం మొక్కలు నాటాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -