క్షత్రియ విద్యాసంస్థల కార్యదర్శి అల్జపూర్ దేవేందర్
నవతెలంగాణ – ఆర్మూర్
ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేడు క్షత్రియ కళాశాలలో సేవా కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాన్ని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ విద్యాసంస్థల కార్యదర్శి అల్జపూర్ దేవేందర్ ముఖ్య అతిథిగా, కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ నరేందర్ ఇందూరు యువత స్వచ్చంద సేవా అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు ఉపాధ్యక్షురాలు సుజాత సుర్యరాజ్ లు పాల్గోన్నారు. ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ నిర్విరామంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను విడియె ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులు చూపిస్తు సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు ముఖ్య అతిథిగా హాజరైన అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూరు యువత చేసే సేవా కార్యక్రమాలు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రతి ఒక్కరు సమాజ సేవలో ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు , ఫ్యాకల్టి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ అల్జాపూర్ దేవేందర్ , ప్రొఫెసర్ ప్రిన్సిపాల్ కట్కం శ్రీనివాస్ ,కళాశాల ఏవో శ్రీ బి నరేందర్ ,కళాశాల హెచ్ ఓ డి స్వప్న ,కళాశాల పాలిటెక్నిక్ కోఆర్డినేటర్ సుజిత్ ,కళాశాల సోషల్ మీడియా ఇంచార్జ్ శృతిన్ ,అధ్యాపకులు ,విద్యార్థులు , విద్యార్థినిలు,పాల్గొన్నారు.
సామాజిక సేవలో ప్రతి ఒక్కరు ముందుండాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



