వెల్నెస్ ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్
నవతెలంగాణ – కంఠేశ్వర్
క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదని, సరైన సమయంలో చికిత్స పొంది, స్క్రీనింగ్ చేసుకుంటే క్యాన్సర్ దరిదాపున కూడా రాదని అందుకే, క్యాన్సర్ వ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వెల్నెస్ ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ వెల్నెస్ ఆసుపత్రి, ఇంజూర్ క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 2.5 ను హైదరాబాద్ రోడ్లో గల బోర్గాం పి జడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి పులాంగ్ ఎక్స్ రోడ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని వెల్నెస్ ఆసుపత్రి ఎండి సుమన్ గౌడ్ జండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెల్ నెస్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ మాట్లాడుతూ…ధూమపానం, మధ్యపా నం, నిలువ ఉన్న పచ్చళ్ళు, ఫ్రిజ్‌ల్లో ఎక్కువ రో జులు నిలువ ఉంచిన ఆహార పదార్థాలు, బేకరీ ఫుడ్‌లు, ఐస్‌క్రీమ్స్. కూల్‌డ్రింక్స్ తదితర వాటిని విరివిగా వాడటం వల్ల కాన్సర్ వ్యాధికి గురవుతారని తెలిపారు. ఆకుకూరలు, కాయకూరలు, పాలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ లాంటి వ్యాధుల కు గురికాకుండా చూసుకోవాలని తెలిపారు. మహిళల్లో వచ్చే బ్రెస్ట్‌క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ల గురించి ప్రొజెక్టర్ల ద్వారా విద్యార్థులకు వివరించారు. ఊబకాయం, సరైన వ్యాయామం లేకపోవడం, మద్యం సేవించడం, దూమపానం వంటి అలవాట్ల వలన క్యాన్సర్‌వ్యాది వస్తుందని పేర్కొన్నారు. సరైన అలవాట్లను అలవర్చుకుంటే క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపై స్ర్కీనింట్ టెస్టుల గురించి తర్వాత స్వీయపరీక్ష నిర్వహించుకోవడంపై వివరించారు.
అనంతరం వెల్నెస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి ఉపయోగపడే విధంగా 50 వేల విలువ చేసే వెల్నెస్ ఆస్పత్రి హెల్త్ కార్డును పేద మధ్యతరగతి కుటుంబాలకు అందజేయనున్నట్లు ఆస్పత్రి ఉపాధ్యక్షులు బోదు అశోక్ తెలిపారు. ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఎండి సుమన్ గౌడ్, వివేకానంద రెడ్డి, అసద్ ఖాన్, జనరల్ మేనేజర్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.