నవతెలంగాణ – ఆలేరు రూరల్
అకస్మాత్తుగా గుండెలో నొప్పిలా వచ్చి పడిపోయే వారికి చేపట్టే కార్డియో పల్మనరి రిసక్సియేషన్ (సీపీఆర్)పై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సి పి ఆర్ ట్రైనర్ డాక్టర్ అశ్విన్ అన్నారు. గురువారం ఆలేరు మండల పరిషత్ కార్యాలయంలో సీపీఆర్(కార్డియో పల్మనరి రిసక్సియేషన్) పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అశ్విన్ పాల్గొని మాట్లాడుతూ.. ఇటీవల సమాజంలో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని అన్నారు. అవి వయసుతో నిమిత్తం లేకుండా వస్తున్నాయన్నారు.చాలావరకు శారీరక శ్రమ లేకపోవడం,మానసిక ఒత్తిడుల కారణంగా గుండెపోటు బాధితులు పెరుగుతున్నారన్నారు. ఆస్పత్రికి వచ్చిన వారు కావచ్చు,బయట ఎక్కడైనా కావచ్చు గుండెపోటుతో అపస్మారక స్థితికి వచ్చిన వారికి సీపీఆర్ చేసి మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హేమావతి,వైద్య సిబ్బంది మున్సిపల్,పోలీసు,ఎలక్ట్రిసిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీపీఆర్ పై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి: డా.అశ్విన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES