నవతెలంగాణ – కుభీర్
రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరు అవగాహన కల్గి ఉండలని కుభీర్ ఎస్ ఐ కృష్ణ రెడ్డి అన్నారు. ఏమేరకు మంగళవారం మండల కేంద్రమైన కుభీర్ వివేకానంద చౌరస్తా లో అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హేచ్చరించారు. హెల్మాట్ ధరించకుండా వాహనాలు నడిపి ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకోవద్దని అన్నారు. తరుచు కొందరు మైనార్లు వాహనలు నడపడం వల్ల ప్రమాధాలు జరుగుతున్నాయని అన్నారు. వాహనదారులు ఇన్సరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబదించిన పత్రాలు దగ్గర ఉండేలా చూడలన్నారు. ప్రమాదం జరిగిన తరవాత బాధపడే కన్నా ప్రమాదం బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



