Tuesday, February 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతను నిర్మించుకోవాలి 

ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతను నిర్మించుకోవాలి 

- Advertisement -

ఎంపీడీవో సింగారం కుమార్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

గ్రామాలలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేసే ప్రతి ఒక్కరూ వెంటనే ఆ ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో మంచిది అని ఎంపీడీవో సింగారం కుమార్ అన్నారు. మండలంలోని ఎర్రబెల్లి గూడెం మేచరాజుపల్లి గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచులు ఉష అశోక్ యాదవ్, తూర్పాటి శంకర్ లతో  కలిసి మంగళవారం పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే ప్రతి లబ్ధిదారుడు వారి ఇండ్లలో కచ్చితంగా ఇంకుడు గుంతను నిర్మించుకోవాలని అన్నారు.

ఇంకుడు గుంత నిర్మించుకుంటే ప్రభుత్వం రూ.6600 కూడా ఇస్తుందని తెలిపారు. ఈ నిర్మాణం చేపట్టుకుంటే వారి ఇండ్లలో బురదమైన లేకుండా మరియు ఇంటినీరు బయటకు రాకుండా రోడ్లపై బురదమయం లేకుండా ఉండే పరిస్థితులు ఉంటాయని అన్నారు. నీటి నిల్వ ఉండి బురద మాయంగా విధులు ఉంటే దోమలు ఈగలు విపరీతంగా ఉండి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు అలా ఇబ్బందులకు గురికాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతను తప్పనిసరిగా నిర్మించుకోవాలని చెప్పారు. అనంతరం మహిళా సమైక్య భవన స్థలాన్ని పరిశీలించారు మరియు వరద కాలువలను కూడా పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో మాధవి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మురళి, రఫీ, టి ఏ సంధ్య,  ఫీల్డ్ అసిస్టెంట్లు ,సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -