జిల్లా సీపీ సాయి చైతన్య
నవతెలంగాణ – ఆర్మూర్
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని జిల్లా సీపీ సాయి చైతన్య అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బుధవారం పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందువరసలో ఉంటారని, ముఖ్యంగా రక్తదానంపై ఉన్న అపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. మనం చేసే రక్తదానం వలన అత్యవసర సమయంలో, ప్రమాద పరిస్థితుల్లో ఉన్నవారికి, తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలవుతుందని, రక్తదానం ఒక మహత్తరమైన సేవ-ఇది మనిషి ప్రాణాలను కాపాడే పవిత్రమైన కార్యం అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రెడ్డి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్, డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీస్ అధికారులు సిబ్బంది పట్టణ యువకులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



