Tuesday, December 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్ హనుమంతరావు

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్ హనుమంతరావు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకవేళ ఓటును దుర్వినియోగం చేస్తే జైలు శిక్ష తప్పదని కూడా హెచ్చరించారు. తెలంగాణ పంచాయతి రాజ్ చట్టంలోని రూల్ 227, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 1951 లోని సెక్షన్ 135 ప్రకారం అట్టి వ్యక్తులపై తీవ్ర మైన చర్యలు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని పేర్కొన్నారు.

కౌంటింగ్ సమయంలో కూడా కౌంటింగ్ సిబ్బంది తప్ప ఇతరులు ఎవరు బ్యాలెట్ పేపర్ ని ముట్టరాదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడవ విడత లో పోలింగ్  జరగనున్న అడ్డగూడూరు, మోత్కూరు, మోటకొండూర్, గుండాల, చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో ని ఓటర్లు తమ ఓటు హక్కు ను సద్వినియోగ పరుచుకోవాలి, కాని  బ్యాలెట్ పేపర్ ని చించడం కానీ , బయటకు తీసుకువెళ్లడం లాంటి చర్యలు చేసిన వారి పై పంచాయతి రాజ్ చట్టం లోని రూల్ 227 ప్రకారం జైలు శిక్ష కు అర్హులు అవుతారని తెలిపారు. కావున అందరూ విధిగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -