Wednesday, February 25, 2026
E-PAPER
Homeఆదిలాబాద్రోడ్డు నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలి: ఎస్పీ

రోడ్డు నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలి: ఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నమని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. బుధవారం మండల కేంద్రమైన కుబీర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో  ‘అలైవ్ అరైవ్’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు. అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాలు తమ కుటుంబాలు రోడ్డున పడేస్తాయని, ప్రతి ఒక్కరూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే పోలీసు లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 30 మంది వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లన బైంసా ఏఎస్పి రాజేష్ మీనా, తో కలిసి పంపిణీ చేశారు.

పోలీసుల అవగాహనతో ఒక్క ప్రాణం నిలబడ్డ సంతోషమే
నిర్మల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత కార్యక్రమాల వల్ల ఏ ఒక్క ప్రాణం నిలబడ్డ పోలీసులు సంతోష పడతామన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి చెపకట్టిన బైక్ ర్యాలీని మండల నాయకులతో కలసి ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ను దారించలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదలకు గురికావద్దన్నారు. రోడ్డు ప్రమాదలకు నివారణ కు అవగహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నుకున్న ఆయా గ్రామాల సర్పంచులు జిల్లా ఎస్పీ తో పాటు పోలీస్ సిబ్బందికి శలవా పూల మాలతో ఘనంగా సన్మాంచారు. గ్రామాలల్లో ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా గస్తీ నిర్వహించేలా చూడలనీ ఎస్పీ కి తెలపరు. ఈ కార్యక్రమంలో బైంసా రూరల్ సి ఐ ప్రవీణ్ కుమార్, కుభీర్ ఎస్ ఐ కృష్ణ రెడ్డి,తనూర్,బైంసా, కుంటాల,ఎస్ ఐలు పోలీస్ సిబ్బంది, ఆయా గ్రామాల తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -