Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలి

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలి

- Advertisement -

– ఆర్మూర్ రూరల్  సీఐ గడ్డం జాన్ రెడ్డి
న‌వ‌తెలంగాణ‌-బాల్కొండ‌ : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని ఆర్మూర్ రూరల్ సీఐ గడ్డం జాన్ రెడ్డి సూచించారు. బాల్కొండ మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం రోడ్డు భద్రతకు సంబంధించి “అరైవ్ అలైవ్ ” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ సీఐ గడ్డం జాన్ రెడ్డి గ్రామస్థులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. యుద్ధంలో జరిగే ప్రాణనష్టం కంటే మన దేశంలో రోడ్డు ప్రమాదాల ద్వారా ఎక్కువమంది చనిపోతున్నారని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఫోర్ విల్లర్ నడిపే వారు కచ్చితంగా సీట్ బెల్ట్ ని వినియోగించాలని సూచించారు. రహదారిపై కుడి వైపునుండే ఓవర్టేక్ చేయాలని,ఎడమ వైపు వెళ్లి ప్రమాధానికి గురి కావద్దని,మద్యం సేవించి వాహనాలు నడిపితే రూపాయలు 10,000 జరిమానా లేదా జైలు శిక్ష తప్పదని అన్నారు. మైనర్ లకు ఎట్టి పరిస్థితిలో వాహనాలు ఇవ్వొద్దని పేర్కొన్నారు. అతి వేగం,నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రమాదాలకు దారితీస్తాయని  తెలిపారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సట్ల గంగా ప్రవీణ్, వార్డు సభ్యులు, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -