నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామములోని శ్రీనివాస రామానుజన్ హై స్కూల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ డైరెక్టర్ శేక్.హమీద్ పాశ ఆధ్వర్యంలో విద్యార్థులకు సి.పి.ఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నాగవర్థన్ రెడ్డి మాట్లాడుతూ గుండె ఆగిన అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే సిపిఆర్ శిక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు.ప్రస్తుత పరిస్థితులలో గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ కావడం వలన సిపిఆర్ అనేది అత్యవసరమని అన్నారు.విద్యార్థులు, యువకులు సీపీఆర్ పై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం అన్నారు.మోటకొండూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్.విజయ్ ఆకస్మికంగా సంభవించే గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు సీపీఆర్ ఎలా చేయాలో విధ్యార్థులకు అవగాహన కల్పించారు.పాఠశాల ప్రిన్నిపాల్ డి.శ్రీరాములు అధ్యక్షత వహించిన ఇట్టి కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు శ్రీశైలం,రాజ్ కుమార్, ట్రస్మా జిల్లా గౌరవ అధ్యక్షులు మెరుగు మధు,ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.
సిపిఆర్ శిక్షణపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి: ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -



