Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక ఎన్నికల్లో అందరు కలిసికట్టుగా ముందుకెళ్లాలి

స్థానిక ఎన్నికల్లో అందరు కలిసికట్టుగా ముందుకెళ్లాలి

- Advertisement -

ఏఎంసీ చైర్మన్ ముప్పగగారెడ్డి, శేఖర్ గౌడ్..
నవతెలంగాణ – డిచ్ పల్లి

స్థానిక ఎన్నికల్లో అందరు కలిసి కట్టుగా ఉండి జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ ఎంపీపీ పదవులను కైవాసం చేసుకోవడానికి ముందుకు వెళ్లాలనినిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, టిపిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ సూచించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి ఆదేశాల మేరకు సోమవారం ఇందల్ వాయి మండల కేంద్రంలో జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ ఎన్నికల్లో నిలిచే అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

జడ్పిటిసి  టికెట్ కోసం దాదాపు పదిమంది వరకు దరఖాస్తులు చేసుకున్నట్లు నాయకులు తెలిపారు. దరఖాస్తులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు  ఇందల్వాయి మండలం లోని అన్ని గ్రామాల నుండి నాయకులు వచ్చి తమకు నచ్చిన గ్రామాలపై దరఖాస్తులు చేసుకున్నారు. ప్రతి ఎంపిటిసి, జెడ్పిటిసి, సర్పంచ్ అందరు విజయం సాధిచాలని వారు కోరారు. రానున్న ఎన్నికలలో అందరు కలిసి కట్టుగా ఉండి విజయ దుందుభి మోగించి జిల్లాలోనే నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేసి ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి కు బహుమతిగా ఇవ్వాలన్నారు.

దరఖాస్తుల కార్యక్రమానికి విజయవంతం చేసినవారందరికి స్థానిక ఎన్నికల ఐదుగురు సభ్యులు గల స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయి రెడ్డి, మాజీ  ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్, కంచెటి గంగాధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాబు నాయక్, డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి ఆనంద్, సోసైటి చైర్మన్లు చింతల పల్లి గోవర్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,బ్లాక్, కిసాన్ కేత్ అధ్యక్షులు చిన్ రెడ్డి సంతోష్ రెడ్డి ,ఎల్ఐసి గంగాధర్, మాజీ వైస్ ఎంపీపీ పూర్య నాయక్, తిర్మన్ పల్లి మాజీ ఎంపీటీసీ చింతల కిషన్, మైనార్టీ నాయకులు హబీబ్, రాజు నాయక్, మహిపాల్ నాయక్ తోపాటు ఎంపిటిసి, సర్పంచ్, జెడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -