Friday, October 31, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జాతీయ సమైక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి : సీఐ

జాతీయ సమైక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి : సీఐ

- Advertisement -

నవతెలంగాణ – మందమర్రి
కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ, జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఏక్తా దివస్ వేడుకలలో భాగంగా శుక్రవారం ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ శశిధర్ రెడ్డి, తహసీల్దార్ సతీష్, సింగరేణి జీఎం రాధాకృష్ణ, మునిసిపల్ కమిషనర్ రాజలింగు హాజరయ్యారు. సింగరేణి పాఠశాల మైదానం నుండి 2కె రన్ ను తహసీల్దార్ సతీష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. రన్ లో పోలీసులు, సింగరేణి అధికారులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, యువతీ యువకులు, రాజకీయ, సామాజిక సంఘాల నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఐ శశిధర్ రెడ్డి, జీఎం రాధాకృష్ణ, తహసీల్దార్ సతీష్ కమీషనర్, రాజలింగు మాట్లాడుతూ సర్ధార్ వల్లభాయ్ పటేల్ దేశ ఏకతా, సమైక్యతకు నిదర్శనమని అతని త్యాగాలు, సేవలు మనందరికీ స్ఫూర్తిదాయకమని పటేల్ చూపిన మార్గంలో నడిచి దేశ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఐక్యతా స్పూర్తితో సమాజంలో శాంతి, సహకారం నెలకొల్పేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రన్ లో విజేతలైన అభిరామ్ (ప్రథమ), రాజేందర్ కానిస్టేబుల్ (ద్వితీయ), నిరంజన్ (తృతీయ) లకు బహుమతులు అందజేశారు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -