నవతెలంగాణ – అశ్వారావుపేట
పల్లెల్లో పట్టణాల్లో పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తీయడంతో పాటు వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడానికి మాస్ లైన్ దోహదపడుతుందని కావున పార్టీ ప్రతీ సభ్యుడు, మండల కమిటీ సభ్యుడు పాల్గొనాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో మండల కార్యదర్శివర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు అద్యక్షతన సోమవారం స్థానికి ప్రజాసంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో మండల కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ మండల వ్యాప్తంగా నేడు పారిశుధ్యం లేమితో మలేరియా,డెంగ్యూ బారిన పడి ప్రజలు అల్లాడుతున్నారు అని,ప్రభుత్వ అమలు చేసే పధకాల లోనూ పక్షపాతం కనిపిస్తుందని తెలిపారు.క్షేత్రస్థాయిలో స్థానిక నాయకులు,కార్యకర్తలు గ్రామాల్లో తిరిగితే సమస్యలను గుర్తించడం జరుగుతుందని అన్నారు.
జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి మాట్లాడుతూ స్థానిక కార్యకర్తలు ఒకరికొకరు సమన్వయం తో మాస్ లైన్ విజయవంతం చేసి,నిర్దేశించిన కార్యాచరణను అమలు చేయాలని మండల కమిటీ సభ్యులను కోరారు. అర్హత ఉండీ రేషన్ కార్డులను రానివారు,గృహాలు మంజూరి కాని వారిని సమీకరించి వారికి మేలు చేసే విదంగా పార్టీ నియమావళిని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సోడెం ప్రసాద్,మండల కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు మడకం గోవిందు,మండల కమిటీ సభ్యులు తిరుపతమ్మ,మురళీ,నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.