Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భిన్నత్వంలో ఐక్యతకు ప్రతీకగా నిలవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి

భిన్నత్వంలో ఐక్యతకు ప్రతీకగా నిలవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ- భూపాలపల్లి

సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తితో దేశ సమగ్రతను కాపాడుతూ, భిన్నత్వంలో ఐక్యతకు ప్రతీకగా నిలవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమానికి ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి  ప్రారంభించారు.

అనంతరం అంబేద్కర్ స్టేడియం నుండి జయశంకర్ విగ్రహం మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు రన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ…దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడటానికి రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం మంచి సందేశాన్ని ప్రజలకు చేర‌వేస్తుందని పేర్కొన్నారు. దేశంలో భిన్న మతాలు, జాతులు, భాషలు ఉన్నప్పటికీ పరస్పరం గౌరవం, సహకారంతో అన్ని వర్గాలు ఐక్యంగా జీవిస్తున్నాయని తెలిపారు. భారత యూనియన్‌లో ఉన్న అనేక సంస్థానాలు దేశంలో కలిసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన పాత్ర ఎంతో గొప్పదని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుల త్యాగాల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్య భారత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ…సర్దార్ పటేల్ దేశ ఐక్యత కోసం అఖండ కృషి చేసి ఉక్కు మనిషిగా పేరుగాంచారని తెలిపారు. నేటి యువత, విద్యార్థులు భారత గౌరవం, సమగ్రత, ఐక్యత గురించి తెలుసుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సామాజిక స్పృహ పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు ఎస్పీ నరేష్, డీఎస్పీ సంపత్ రావు, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి రఘు, పోలీసు అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -