Sunday, May 11, 2025
Homeరాష్ట్రీయంభారత సైన్యానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి

భారత సైన్యానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి

- Advertisement -

మాజీ ఎంపీ వీహెచ్‌ హనుమంతరావు
నవతెలంగాణ-హైదరాబాద్‌

ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో పోరాటం చేస్తున్న భారత సైన్యానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని మాజీ ఎంపీ వీహెచ్‌ హనుమంతరావు అన్నారు. పాకిస్తాన్‌ దుశ్చర్యను నిరసిస్తూ శనివారం హైదరాబాద్‌ అంబర్‌పేటలోని జ్యోతిబా పూలే విగ్రహం నుంచి శ్రీ రమణ చౌరస్తాలోని డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను విజయవంతం చేసిన భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీ. హనుమంతరావు మాట్లాడుతూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు యావత్‌ భారత ప్రజలు అండగా నిలుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో నాంపల్లి కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే ఫిరోజ్‌ ఖాన్‌ ముజాహిద్‌ ఖాన్‌, ఆర్‌ లక్ష్మణ్‌ యాదవ్‌, ఖైరతాబాద్‌ జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్‌ గౌడ్‌, పి నారాయణ స్వామి, హరినాథ్‌ రెడ్డి, అప్సర్‌ యూసఫ్‌ దిండి రాంబాబు, పులి జగన్‌, గరిగంటి రమేష్‌, రోహిత్‌, శంభుల శ్రీకాంత్‌ గౌడ్‌, సత్తిబాబు, రామ్మోహన్‌ కష్ణ గౌడ్‌, రాజేశ్వరరావు, ఠాగూర్‌ హరి, కోటం అనిల్‌, ప్రభాకర్‌, జమీర్‌, ఫరీద్‌, లక్ష్మణ్‌ మహమ్మద్‌, విజిత రెడ్డి, కవిత, శ్రీనివాస్‌ రెడ్డి, షేక్‌ సమద్‌ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు షేక్‌ సర్ఫరాజ్‌ అయాన్‌, మన్మోహన్‌ వంశీ, బబ్లు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -