Wednesday, December 3, 2025
E-PAPER
Homeజాతీయంఅందరూ సంచార్‌ సాథీ యాప్‌ వినియోగించాలి

అందరూ సంచార్‌ సాథీ యాప్‌ వినియోగించాలి

- Advertisement -

– కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

అందరూ సంచార్‌ సాథీ యాప్‌ను వినియోగించాలని కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్‌ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కోరారు. మంగళవారం నాడిక్కడ ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ”టెలికాం మంత్రిత్వ శాఖ, డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో కలిసి సంచార్‌ సాథీ యాప్‌ రూపొందించాం. గత ఏడాది నుంచి 50 లక్షల మంది బాధితులు సైబర్‌ ఫ్రాడ్‌ బారిన పడ్డారు. ఇప్పటి వరకు రూ. 23 వేల కోట్లు నష్టపోయారు. మోసాలకు గురయ్యే వారు వృద్ధులు, తెలియని వారు ఉన్నారు. ఆర్థిక నేరాలను అరికట్టేందుకు సంచార్‌ సాథీ యాప్‌ను రూపొందించాం. ఎవరైనా ఫోన్‌ కొట్టేసిన, లేదంటే ఏదైనా ఫోన్‌ను దొంగిలించి అమ్మేశారా? అనేది కూడా తెలుస్తుంది. 2.20 కోట్ల మొబైల్‌ నెంబర్లను బ్లాక్‌ చేశాం. 26 లక్షల ఫోన్లు దొంగిలించారు. అందులో 7 లక్షల ఫోన్లు రికవరీ చేశాం. ఈ యాప్‌ను ఫోన్‌లో ముందే ఉండేలా చూడాలని మొబైల్‌ కంపెనీలను విజ్ఞప్తి చేశాం. ఈ యాప్‌తో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతిపక్షాలు చెప్పినట్టు అలాంటి అంశాలు ఏమీ లేవు. ఇప్పటి వరకు రూ.500 కోట్ల ఫ్రాడ్‌ లావాదేవీలకు అడ్డుకట్ట వేశాం” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -