నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని అంకుశపూర్ గ్రామ పంచాయతీ లోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం రోజున “పోషణ మాసం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ రాధిక రెడ్డి మాట్లాడుతూ… పోషకాహార లోపం “సమాజ అభివృద్ధికి” అడ్డంకిగా మారకూడదన్నారు. ప్రతి అంగన్వాడి టీచర్ తన పరిధిలో ఉన్న బాలింతలు,గర్భిణీ స్త్రీలు ,చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతను తెలియజేయాలని తెలిపారు. ఆకుకూరలు ,పప్పులు, గుడ్లు, పాలు వంటివి తీసుకోవడం ద్వారా లభించే ప్రోటీన్స్, విటమిన్స్ ,మినరల్స్ మన శరీర రక్షణకు ముఖ్యమైనవని అన్నారు.
వీటి గురించి సమాజంలో అవగాహన పెంచి పోషణ లోపం లేని సమాజం నిర్మించడానికి అందరం కృషి చేయాలని తెలియచేశారు. అంగన్వాడీ సెంటర్ లలో అందించే సేవలు ప్రతి ఒక్కరు వినియోగించు కోవాలని, 3-6 సం. పిల్లలను అంగన్వాడీ లో చేర్పించాలన్నారు. ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, చిన్న పిల్లల తల్లులుతో ప్రతిజ్ఞ చేయించారు.ప్రీస్కూల్ పిల్లల శాతాన్ని పెంచాలని అంగన్ వాడి టీచర్లను ఆదేశించారు. అనంతరం గర్భిణీ లకు శ్రీమాంతలు, అన్న ప్రసన్న, అక్షర బ్యాసం కార్యక్రమాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రథం ఎన్ జి ఓ సమ్మయ్య, చైల్డ్ ఎన్ జి ఓ శ్రీలత, అంగన్ వాడీ టీచర్స్, షాహెదవేగం, శ్రీలత, హైమావతి, పుష్పలత, ఆయాలు పాల్గొన్నారు.