Tuesday, July 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి

సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి

- Advertisement -
  • – కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బండారి తిరుపతి
    నవతెలంగాణ – శంకరపట్నం
  • ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని, తద్వారా ఇందిరా గాంధీ కలలను సాకారం చేయాలని కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి బండారి తిరుపతి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో సోమవారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహాలకు ముగ్గు పోసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బొజ్జ చంద్రమౌళి, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఇసాముద్దీన్, గ్రామ శాఖ అధ్యక్షులు మొలంగూరి సదానందం, సీనియర్ నాయకులు కల్లేపల్లి రాజయ్య, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -