Monday, March 2, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

- Advertisement -

మండల ఎంపీ ఓ భీమేష్..
నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుబీర్ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులకు మొదటి విడత కింద శిక్షణ తరగతులను మండల ఎంపీవో భీమేష్ నిర్వహించడం జరిగింది. ఈ ఈ శిక్షణ తరగతులు మండలంలో 42 గ్రామపంచాయతీలకు సంబంధించిన ఉపసర్పంచులు వార్డ్ సభ్యులకు 3 విడతల కింద శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది.

మొదటి విడత ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీఓ భీమేష్ మాట్లాడుతూ గ్రామపంచాయతీలో వార్డు సభ్యుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. గ్రామా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అదేవిధంగా గ్రామపంచాయతీకి సంబంధించిన పలు అంశాలను వివరించడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, శానిటేషన్, త్రాగు నీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీ ఓ  శిక్షణ అధికారులు వార్డు సభ్యులు తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -