Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ఏఎస్పి

డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ఏఎస్పి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ : డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కామారెడ్డి ఎ.ఎస్.పి చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం భిక్కనూరు గంజి చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి యువతకు మత్తు మాదకద్రవ్యాలు వంటివి జోలికి వెళ్ళవద్దని వాటికి దూరంగా ఉండాలన్నారు. యువత చెడు వ్యసనాల అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. జిల్లాలో గంజాయి మత్తు పదార్థాల వంటి వాటిని అరికట్టడానికి పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు. టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో భారీ పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగ ఉపాది అవకాశాలు లభిస్తే ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు యువత చెడు వ్యసనాల వంటివి వైపు వెళ్లకుండా ఉండే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి యువత కష్టపడి చదువుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజ్ గంగారెడ్డి, సిఐ సంపత్ కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, పుష్ప రాజ్, స్రవంతి, డాక్టర్ హేమీమా, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad