జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, ఆపరేషన్ ముస్కాన్, ఈ నెల 31 వరకు జిల్లా లో పకడ్బందీగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీయుత ఏ భాస్కర్ రావు సంబంధిత అధికారులను కోరారు. గురువారం రోజు మినీ మీటింగ్ హాల్ లో ఆపరేషన్ ముస్ఖాన్ కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్, కార్మిక, విద్యా, వైద్య శాఖ ల అధికారులతో ఆపరేషన్ ముస్కాన్, కార్యక్రమాల అమలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
బాలల హక్కులను కాపాడి వారికి మంచి భవిష్యత్తును అందించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. 2025-26 సంవత్సరం ప్రారంభమైన బడికి రాని పిల్లలు,మధ్యలో బడి మానేసిన పిల్లలు బాల కార్మికులను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించాలన్నారు. 14 సంవత్సరాల వయసు కలిగిన బాల కార్మికులు ఏం పని చేస్తున్నారని గుర్తించినట్లయితే యజమానియాలపై కేసులు నమోదు చేసి పిల్లలకు నష్టపరిహారం అందించాలన్నారు. కార్మిక శాఖ అధికారులతో కలసి బృంద సభ్యులతో కలసి పరిశ్రమలు, దుకాణాలు, నిర్మాణ ప్రాంతాలు . హాట్ స్పాట్ ప్రదేశాలను గుర్తించిన తర్వాత హాట్ స్పాట్ ప్రదేశాలు సందర్శించి బాల కార్మికులను గుర్తించాలన్నారు.
బాల కార్మికులను పనుల్లో పెట్టుకోవడం చట్ట రిత్యా నేరమని విషయాన్ని యజమానులకు తెలిపే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. బాల్యవివాహాలను నిర్మూలించే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ ను అన్ని శాఖల అధికారుల సమన్వయతో నిర్వహించాలని పక్కా ప్రణాళిక రూపొందించుకొని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా కృషి చేయాలన్నారు. బాలల పరిరక్షణ సర్వతో ముఖాభివృద్ధికి అధికారులు తమ తోడ్పాటు అందించా లన్నారు. అనంతరం చైల్డ్ హెల్ప్ లైన్ లోగో ను ఆవిష్కరించారు. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్స్ 1098 , 112 సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని నరసింహారావు , భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ , జిల్లా ఉప వైద్య అధికారి యశోద,అసిస్టెంట్ లేబర్ కమీషనర్ అరుణ, బీ ఆర్ బీ కో ఆర్డినేటర్.అనంత లక్ష్మీ, సిడిపిఓ లు స్వరాజ్యం, వెంకట రమణ,జ్యోష్ణ, డీసీపీయు, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది, జిల్లా లో ఉన్న చైల్డ్ కేర్ ఇన్స్ట్యూషన్స్ సిబ్బంది పోలీస్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.