నవతెలంగాణ – తంగళ్ళపల్లి
మాదక ద్రవ్యాల నిర్మూలనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా రవాణా శాఖ మోటార్ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ అన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మన్ ఆదేశానుసారం మండలంలోని ఇందిరమ్మ కాలనీలోని ఆర్టిఏ డ్రైవింగ్ టెస్ట్ మైదానంలో బుధవారం వాహనదారులచే మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వంశీధర్ మాట్లాడుతూ.. ఎవరైనా సరే మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేసిన, విక్రయించిన వెంటనే సంబంధిత పోలీస్ శాఖకు సమాచారం అందించాలన్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఎవరైనా సరే మాదకద్రవ్యాలకు అలవాటు పడితే వారి వివరాలను సంబంధిత పోలీసులకు అందించాలన్నారు.ఇట్టి ప్రతిజ్ఞలో సహాయక మోటర్ వాహనాల తనిఖీ అధికారి ప్రమీల,కానిస్టేబుల్ సౌమ్య, హోంగార్డ్ ఎల్లేష్ పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES