Sunday, February 22, 2026
E-PAPER
Homeసినిమాఅందరూ షాక్‌ అవుతారు

అందరూ షాక్‌ అవుతారు

- Advertisement -

భిన్న పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్‌ కుమార్‌తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్‌ పై నిర్మిస్తున్న చిత్రం ‘సరస్వతి’. హై-కాన్సెప్ట్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని చిత్ర ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’వరలక్ష్మీ ఈ కథ చెప్పినప్పుడు స్టన్‌ అయిపోయాను. ఈ కథను అత్యద్భుతంగా చేసింది. ఆడియన్స్‌ కూడా థియేటర్లో సినిమా చూసి షాక్‌ అవుతారు. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన మంచి సినిమా ఇది. తను ఆర్టిస్ట్‌గా నిరూపించుకుంది.

ఇప్పుడు డైరెక్టర్‌గా కూడా తన మార్క్‌ చూపించబోతోంది’ అని అన్నారు. ‘మీ అంచనాలకు తగ్గకుండా ఒక కంటెంట్‌ని మీకు అందిస్తున్నాం. ఫిమేల్‌ కంటెంట్‌ అని మరీ సందేశాత్మకంగా ఉండదు. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. బన్నీ వాసు సినిమా చూసి చాలా అభినందించారు. అదే నా ఫస్ట్‌ సక్సెస్‌గా భావిస్తున్నాను. చాలా మంచి సినిమా తీశాం. అందరూ కూడా ఈ సినిమాకి సపోర్ట్‌ చేసి ఇండిస్టీలో అమ్మాయిల్ని ఇంకా ప్రోత్సహిస్తారు అని కోరుకుంటున్నాను. ట్రైలర్‌ని డిజిటల్‌లో లాంచ్‌ చేసిన హీరో నానికి థ్యాంక్స్‌’ అని డైరెక్టర్‌, హీరోయిన్‌ వరలక్ష్మి శరత్‌ కుమార్‌ చెప్పారు. నిర్మాత పూజా శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా విషయంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. వరు తను అనుకున్న టైంకే ఈ సినిమాని పూర్తి చేసింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -