తాడిచెర్లలో ఎవరిని అడిగినా ఫుట్ బాలే..
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల మేజర్ గ్రామపంచాయతీలోని 14 వార్డుల్లో అందరి నోటా…బండి స్వామి మాటే, ఎవరిని అడిగిన ఫుట్ బాలే అంటున్నారు. తాడిచెర్ల సర్పంచ్ అభ్యర్థిగా బండి స్వామి నామినేషన్ వేయకముందు, వేసిన తరువాత గ్రామంలో అన్నివర్గాల ప్రజలు ఆయనకే తమ ఓటు అంటూ చర్చించుకోవడం పురవీధుల్లో ప్రస్తుతం వినిపిస్తున్న మాట. గతంలో వార్డు సభ్యుడు,ఉప సర్పంచ్ గా ప్రజలకు సేవలందించిన తనకు సర్పంచ్ గా అవకాశం ఇచ్చి తన ఫుట్ బాల్ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు నాయకుడిగా కాదు ఒక సేవకుడిగా సేవలందిస్తాను అంటున్నాడు స్వామి.
గ్రామంలో ఏ మూలన ఏ కులంవారు, ఏ పార్టీ వారు, ఏ మతం వారు స్వర్గీయులైన అక్కడికి చుట్టం రావడం ఆలస్యం కావచ్చు కానీ స్వామి మాత్రం అట్టే వాలిపోయి వారి కష్టాల్లో పాలుపంచుకొని, అంత్యక్రియల్లో తనకు తోచిన సాయం చేయడమే స్వామి నిజాయితీ. ఇప్పుడు ఆ మానవదృక్పదమే ఆయన విజయానికి నాంది పలకడం ఇక తథ్యమే అంటున్నారు స్థానికులు. ప్రచారంలో భాగంగా గడపగడపకు అన్నివర్గాల ప్రజలు స్వామికి బ్రహ్మరథం పట్టడంతో గెలుపు దిశలో దూసుకెళుతున్నారు.



