నవతెలంగాణ – కాటారం: ఒకసారి అవకాశం ఇవ్వండి కాటారం గ్రామపంచాయతీని అవినీతి లేని అభివృద్ధి పథంలో నడిపి చూపిస్తానని ప్రజలు బలపరిచిన అభ్యర్థి కాటారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి గోగు రాజబాబు అన్నారు. గ్రామంలో తనకంటూ, మంచి తనానికి మారుపేరుగా గుర్తింపు సొంతం చేసుకొని, ఉనత విద్య వంతుడు అందరి బాధలు తెలిసిన వాడు కాటారం సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వెళ్తున్నారు. గ్రామం లో అవినీతి లేని అభివృద్ధి ముందంజలో ఉండాలి అంటే గోగు రాజబాబు గెలిపించాలి అని గ్రామస్తులు భావిస్తున్నారు.
స్థానిక ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా బుదవారం గ్రామంలో ఘనంగా ర్యాలీ నిర్వహించి ఇంటింటా ఓటర్లను అభ్యర్థిస్తూ ఘనంగా ప్రచారం నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల సమస్యలు దగ్గరగా తెలుసుకుని పరిష్కరించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. నా తపన అంత ప్రజాసేవనని, అవినీతే లేని అభివృద్దే నా లక్ష్యం అని ప్రజలకు మాట ఇచ్చారు. ప్రజల అండ దండాలు ఆశీర్వాదం అందించి భారీ మెజార్టీతో గెలిపిస్తే అందరి సహకారంతో గ్రామానికి రావలసిన నిధులను తెచ్చి మౌలిక సదుపాయాలను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని ప్రకటించారు. నాయకులతో కార్యకర్తలతో ఆయన కలిసి నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి గ్రామస్థుల, యువకుల నుండి బారి స్పందన చూపారు.



