Sunday, January 11, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: ఎంపీడీఓ

పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: ఎంపీడీఓ

- Advertisement -

గట్టి బందోబస్తు..
నవతెలంగాణ – ముధోల్

మూడవ విడత పంచాయతీ పోలింగ్ కుఅన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో లవకుమార్ తెలిపారు. బుధవారం జరగనున్న ఈమూడవ దశ పంచాయతీ ఎన్నికలు సంబంధిత ఎన్నికల అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టి అన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు .ముధోల్ మండలంలోని 19 గ్రామ పంచాయతీల గాను మండలంలోని ఎడ్ బిడ్ తండా, విట్టోలి తండా, గ్రామపంచాయతీలరెండు సర్పంచ్ స్థానాలు అలాగే మండలంలోని53 వార్డులు ఏక గ్రీవం కాగా 17 పంచాయతీ ల సర్పంచ్ లకు 113 వార్డుల కు ఎన్నికలు జరగనున్నాయి.

మంగళవారం ముధోల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పోలింగ్ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ,17 గ్రామ పంచాయతీలకు గాను ఐదు రూట్ల గాను ఐదుగురిని రూట్ల ఆఫీసర్ లు ఏర్పాటు చేసి ఐదు కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ కౌంటర్ల ద్వారా సంబంధిత జీపీలకు ఎన్నికల సామాగ్రిని ఆర్వో ,పీవో,ఓపిఓలకు అందజేశారు అలాగే ప్రత్యేకంగా హెల్ఫ్ డెస్క్ ను ఏర్పాటు చేశారు.  ఈ ప్రక్రియను జిల్లా సీఈవో దుర్గం శంకర్,  అలాగే మండల ప్రత్యేక అధికారి రాథోడ్ సుదర్శన్ తో పాటు ఎంపీడీవోలవ కుమార్, ఎంపీవోశివకుమార్, తాసిల్దార్ శ్రీలత పర్యవేక్షించారు ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

అయితే ఈ ఎన్నికలకు 18అర్వో లు,180 పిఓ లను 274 ఏపీఓలను  లను నియమించినట్లు తెలిపారు అంతేకాకుండా ఐదుగురు రూట్లు ఆఫీసర్లను నియమించారు .హెల్ఫ్ డెస్క్ తోపాటు రిజర్వు కౌంటర్, అటెండెన్స్ కౌంటర్, తో పాటు తదితర ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు ఇంతే కాకుండా ఇద్దరు జోనల్ ఆఫీసర్లను తోపాటు ఐదుగురురూటు ఆఫీసర్లను నియమించారు ముధోల్ మండలంలోని  మొత్తం 28754 ఓటర్ల కు గాను11844 పురుషులు 14,908 మహిళలు ఇతరులు ఇద్దరు  ఓటర్లు ఉన్నారు 

గట్టి బందోబస్తు
బుధవారం నిర్వహించే ఈ పోలింగ్కు అందరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించేందుకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు ను  ఏర్పాటు చేసినట్లు ముధోల్ సిఐ మల్లేష్ తెలిపారు ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా పగడ్బందీ భద్రత చర్యలు చేపట్టినట్లు సిఐ వెల్లడించారు ఇందులో ఇద్దరు సిఐలు పదిమంది ఎస్సైలు ఒక వంద ఐదు మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు ఆయన వివరించారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సదుద్దేశంతోనే భద్రత చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -