మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలలో పోలింగ్
పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది, సామాగ్రి
డివిజన్ వ్యాప్తంగా 241 సర్పంచ్ స్థానాలకు ఎన్ని
ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్
నవతెలంగాణ – మిర్యాలగూడ
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రెండో విడతలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా పది మండలాల్లో 241 సర్పంచ్ స్థానాలకు, 1832 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు శనివారం సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ పర్యవేక్షణలో పోలింగ్ సామాగ్రిని పంపిణి చేశారు. సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ డివిజన్ పరిధిలో అడవిదేవులపల్లి, వేములపల్లి, మాడ్గులపల్లి, మిర్యాలగూడ, దామరచర్లలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించి పోలింగ్ సిబ్బంది, అధికారులకు పలు సూచనలు చేశారు.
మిర్యాలగూడ డివిజన్లోని అడవిదేవులపల్లి మండలంలో 13 సర్పంచ్ స్థానాలు ఉండగా రెండు ఏకగ్రీవం కావడంతో 11 స్థానాలకు, 108 వార్డులకు 17 స్థానాలు ఏకగ్రీవం కాగా 91 స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. అనుములలో 24 సర్పంచ్ స్థానాలకు 4 ఏకగ్రీవం కాగా 19 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా మరొక గ్రామమైన పేరూరులో ప్రజలు నామినేషన్ వేయకపోవడంతో అక్కడ ఎన్నిక నిలిచిపోయింది.
అనుములలో 202 వార్డులు ఉండగా 50 ఏకగ్రీవం కాగా 138 స్థానాలకు, దామరచర్లలో 35 సర్పంచ్ స్థానాలు ఉండగా 1 స్థానం ఏకగ్రీవం కాగా 34 స్థానాలకు, 302 వార్డులు ఉండగా 83 ఏకగ్రీవం కాగా 219 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మాడ్గులపల్లిలో 27 సర్పంచ్ స్థానాలు ఉండగా 5 ఏకగ్రీవం కాగా 21 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇందుగుల గ్రామంలో హైకోర్టు ఉత్వర్వుల మేరకు ఎన్నిక నిలిచిపోగా 228 వార్డులు ఉండగా 43 ఏకగ్రీవం కాగా 177 స్థానాలకు, మిర్యాలగూడలో 48 సర్పంచ్ స్థానాలకు రెండు ఏకగ్రీవం కాగా 44 స్థానాలకు, 394 వార్డులకు గాను 58 ఏకగ్రీవం కాగా 336 స్థానాలకు, నిడమనూరులో 28 సర్పంచ్ స్థానాలకు, 258 వార్డులకు 36 ఏకగీవ్రం కాగా 218 స్థానాలకు, పెద్దవూరలో 28 సర్పంచ్ స్థానాలకు 4 ఏకగ్రీవం కాగా 24 స్థానాలకు, 244 వార్డులకు గాను 42 స్థానాలు ఏకగ్రీవం కాగా 202 స్థానాలకు, త్రిపురారంలో 32 సర్పంచ్ స్థానాలు ఉండగా 8 ఏకగ్రీవం కాగా 24 స్థానాలకు, 270 వార్డులకు గాను 90 ఏకగ్రీవం కావడంతో 180 స్థానాలకు, తిరుమలగిరి (సాగర్) లో 35 సర్పంచ్ స్థానాలు ఉండగా 12 ఏకగ్రీవం కాగా 23 స్థానాలకు, 288 వార్డులకుగాను 128 ఏకగ్రీవం కాగా 159 స్థానాలకు, వేములపల్లిలో 12 సర్పంచ్ స్థానాలకు, 116 వార్డులకు గాను రెండు ఏకగ్రీవం కాగా 114 స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. కాగా మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా 281 సర్పంచ్ స్థానాలు, 2408 వార్డులు ఉండగా 38 సర్పంచ్ స్థానాలు, 553 వార్డులు ఏకగ్రీవం కాగా 241 సర్పంచ్ స్థానాలకు, 1832 వార్డులకు నేడు ఎన్నికలు జరగనుండగా బరిలో నిల్చొన్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.



