Tuesday, September 30, 2025
E-PAPER
Homeకరీంనగర్Former Sarpanch : మాజీ సర్పంచ్ చెప్పినవన్నీ అబద్ధాలే

Former Sarpanch : మాజీ సర్పంచ్ చెప్పినవన్నీ అబద్ధాలే

- Advertisement -

మైసమ్మ వాగు గ్రామాన్ని డెవలప్ చేయలేదు

తారు రోడ్డు వేసింది మంత్రి పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఏదు రమేష్

నవతెలంగాణ-అక్కన్నపేట

గత కొద్ది రోజులుగా మైసమ్మ వాగు గ్రామ సర్పంచ్ లావణ్య కుమార్ మీడియా ముందుకు వచ్చి ఆస్తులు ఏమీ లేవని చెప్పడం అంతా అబద్ధమేనని గ్రామ శాఖ అధ్యక్షుడు ఏదు రమేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం భూములు అమ్మానని చెప్పి అందరిని తప్పుదారి పట్టించారని తెలియజేశారు. నిజానికి ఆమె సర్పంచ్ ఎలక్షన్స్ ముందే రెండు ఎకరాల భూమి అమ్ముకొని పోటీ చేశారని అన్నారు. అంతేకాకుండా  గ్రామంలో ఎంతో అభివృద్ధి చేశానని చెబుతున్నాడని, అసలు అభివృద్ధి ఎక్కడ కనబడుతోందని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చిన తర్వాతే గ్రామానికి తారు రోడ్డు వచ్చిందని, రోడ్డు ఆయనే తెప్పించాడని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆరు ఎకరాలకు పైగానే ఆయనకు భూమి ఉందని, అందుకే ఆయనకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని తెలియజేశారు.

రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రపోజల్ పంపామని, అది రాకముందే కాంగ్రెస్ పార్టీని బదనం చేయడం కోసమే ఇలా తప్పుడు విషయాలను మీడియా ముందు తెలిపి సింపతి తెచ్చుకునే ప్రయత్నం చేశారన్నారు. అంతేకాకుండా గ్రామపంచాయతీ బిల్లులు 10 లక్షలు రావాలని చెప్పాడని, నిజానికి ఆయనకు రూ:2.30 లక్షలు మాత్రమే వచ్చేది ఉందన్నారు.. అంతేకాకుండా మార్కెట్ యార్డు కోసం స్థలం కేటాయించి దానిపై బిల్లులు తీసుకొని, అదే ప్లేస్ లో క్రీడా ప్రాంగణం కూడా ఏర్పాటు చేసి బిల్లు తీసుకున్నాడని తెలియజేశాడు.

అసలు లావణ్య దంపతులు సర్పంచ్ గా ఉన్న సమయంలో నిరుపేదలకు ఒక్క ఇల్లు అయినా ఇచ్చారా, కనీసం రేషన్ కార్డులు అయినా ఇప్పించారా అంటూ ప్రశ్నించారు. ఊరికి ఏమి చేయకుండా స్థానిక ఎలక్షన్స్ లో మళ్ళీ ప్రజలను తప్పుదారి పట్టించి, సింపతి క్రియేట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేశాడన్నారు. అయినా కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీ ఆయన పేరు లిస్టులో పెట్టిందని, త్వరలోనే ఆయనకు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయించబోతుందని తెలియజేశారు. ఇలా లేనిపోని ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీని మంత్రి పొన్నం ప్రభాకర్ కు చెడ్డపేరు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -