Saturday, March 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరవాణాశాఖ మంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే

రవాణాశాఖ మంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే

- Advertisement -

టీజీఎస్‌ ఆర్టీసి జేఏసీ
నవతెలంగాణ-హైదరాబాద్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల కాలంలో ఏడు సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ఆర్టీసీ సమస్యలపై ప్రతిపక్ష సభ్యులడిగిన ప్రశ్నలకు ఒకే రకమైన సమాధానం చెబుతూ పక్కదారి పట్టిస్తున్నారని టీజీఎస్‌ ఆర్టీసీ జేఏసీ చైర్మెన్‌ ఈదురు వెంకన్న, వైస్‌ ఛైర్మెన్‌ ఎం.థామస్‌రెడ్డి, కన్వీనర్‌ ఎండి.మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్‌, బి.యాదగిరి అన్నారు. ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం గురించి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేసి, గవర్నర్‌తో గెజిట్‌ పబ్లిష్‌ చేసినప్పటికీ ఈ ప్రభుత్వం ఇప్పటివరకు విలీనం గురించి తీసుకున్న చర్యలు శూన్యమని అన్నారు. మంత్రి సభలో మాట్లాడుతూ విలీనం గురించి కమిటీ వేశామనీ, ఈ అంశం కమిటీ పరిశీలనలో ఉందన్నారు. తప్పుడు సమాధానం చెప్పడం సరికాదనీ, ఈ ప్రభుత్వం కమిటీ ఎప్పుడు వేసిందన్నారు. అలాగే ఆర్టీసిలో కారుణ్య నియామకాలను కొత్త నియామకాలుగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా వెంటనే అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు జేఏసీ కన్సల్టేషన్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ సునీత గోపాల్‌దాస్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కోశాధికారి బి.యాదయ్య, ఎ.ఆర్‌.రెడ్డి, జె.రాఘవులు, ఎన్‌. కమలాకర్‌ గౌడ్‌, కా.సత్యం, బుద్ధ విశాల్‌ జి.రాములు, శ్రీనివాస్‌, రాంచందర్‌, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -