నవతెలంగాణ – హైదరాబాద్: 17వ తేదీ ఆదివారం మందమర్రిలో సొతుకు రత్న జానకి రచించిన సృష్టి సాక్ష్యాలు పుస్తకావిష్కరణ జరిగింది. గాయకుడు దండనాయకుల వామనరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ కవి, సినీ, టీవీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ హాజరయ్యారు. కవితా సంపుటిని ఆవిష్కరించిన తర్వాత మౌనశ్రీ మాట్లాడుతూ.. రత్న జానకి సామాజిక అంశాలను అద్భుత కవిత్వంగా మార్చడంలో నూటికి నూరు శాతం విజయం సాధించారని అన్నారు. నీలాదేవి పుస్తకాన్ని అద్భుతంగా సమీక్షించారు. అనంతరం పుస్తకాన్ని రచయిత్రి భర్త గొంతుకు సుదర్శన్ కు అంకితం చేశారు. కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా అల్లాడి శ్రీనివాస్, తోకల రాజేశం పాల్గొన్నారు. వాణిజ్య శాస్త్ర ధ్యాపకుడు చంద్రశేఖర్ వ్యాఖ్యానం సవికులను అలరించింది. ఈ కార్యక్రమంలో కవయిత్రి అడ్డగూరి శ్రీలక్ష్మి తో పాటు పట్టణానికి చెందిన చాలామంది సాహిత్యకారులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
