Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గీత కార్మికుల ఎక్స్ గ్రేషియా నిధులు విడుదల చేయాలి

గీత కార్మికుల ఎక్స్ గ్రేషియా నిధులు విడుదల చేయాలి

- Advertisement -

కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయ రాములు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత వృత్తిలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి క్రిందపడి ప్రమాదాలకు గురై మృతి చెందిన తీవ్రంగా గాయపడి మంచాలకే పరిమితమైన సుమారు 800 మంది కల్లుగీత కార్మికులకు రెండు సంవత్సరాలుగా ఎక్స్ గ్రేషియా మంజూరైన వారికి రావాల్సిన 13 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి బాధిత కుటుంబాలకు తక్షణమే అందించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం రోజున భువనగిరి పట్టణంలోని వైయస్సార్ ఫంక్షన్ హాల్లో కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశము సంఘం జిల్లా అధ్యక్షులు రాగీరు కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించగా, హాజరై మాట్లాడారు.

 చేతివృత్తులలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తి కల్లుగీత వృత్తి అని ఈ వృత్తిని ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆధునికరించాలని శ్రద్ధ పెట్టకపోవడం వల్ల వృత్తిలో ప్రమాదాలు జరిగి సంవత్సరానికి వందలాది మంది గీత కార్మికులు చనిపోవడం గాయపడడం జరుగుతుందని ఇప్పటికైనా ప్రభుత్వాలు కల్లుగీత కార్మికులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూడకుండా వారి వృత్తిని ఆధునికరించి వారి సంక్షేమానికి బడ్జెట్లో 5000 కోట్ల రూపాయలు కేటాయించి వృత్తిరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఇటీవల రెండు సంవత్సరాలుగా వృత్తిలో ప్రమాదానికి గురై చనిపోయిన గాయపడిన 800 మంది గీత కార్మికులకు రావాల్సిన పెండింగ్ ఎక్స్గ్రేషియాలకు 13 కోట్లు రూపాయలు కేటాయించడంలో కూడా నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని తెలిపారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి అనేక రకాల వాగ్దానాలు తన మేనిఫెస్టోలు ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు వాటిని అమలు చేయలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి గీత కార్మికుల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఒకవేళ గీత కార్మికుల పెండింగ్ ఎక్స్గ్రేశాలు నిధులు విడుదల చేయకపోతే తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17న ఇందిర పార్క్ వద్ద రాష్ట్ర కమిటీ సభ్యుల సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నామని ఇట్టి కార్యక్రమానికి వేలాది మంది గీత కార్మికులు హాజరై ప్రభుత్వానికి కనువిప్పు కలిగేల ఉద్యమించాలని కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు,  అంతటి అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు భావండ్లపల్లి బాలరాజు, బత్తుల లక్ష్మయ్య, సుధాగాణి రామచంద్రయ్య, కొక్కొండ లింగయ్య, సహాయ కార్యదర్శి పల్సము స్వామి, జిల్లా కమిటీ సభ్యులు రాంపల్లి సోములు, మచ్చ భాస్కర్, కునురు మల్లేష్, మారగొని శ్రీరామమూర్తి, పబ్బతి మల్లేష్, చెరుకు బాలరాజు, ఋషి గంపల పరుశరాములు, రంగ కొండల్  లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -