- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ గుండెపోటుతో కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఆయనను పరీక్షించిన వైద్యులు మరో రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. అయితే ఈలోపే పరిస్థితి మరింత విషమించడంతో మదన్ లాల్ ఇవాళ ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి.
- Advertisement -