Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్ అందజేత 

విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్ అందజేత 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని గిద్ద జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఆట్టలను నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా సంస్థ వ్యవస్థాపకులు నా రెడ్డి మోహన్ రెడ్డి అందజేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సహకరించాలని ఉద్దేశంతో, మండలంలోని పదవ తరగతి విద్యార్థులందరికీ పరీక్ష పట్టాలను అందజేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పేద విద్యార్థుల చదువులకు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. విద్యార్థులు కష్టపడి, మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రగోతం రెడ్డి , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -