నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఏడ్గి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు గ్రామానికి చెందిన దాత జ్ఞానేశ్వర్ డోంగ్లే స్వంత ఖర్చులతో హెచ్ఎం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్ చేతుల మీదుగా పరీక్ష ప్యాడ్లు పెన్నులను శుక్రవారం వితరణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలు పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సూచనలు చేశారు. పరీక్షలు అంటే భయం పెట్టుకోవద్దని అన్నారు. నిర్భయంగా భయాందోళనకు గురికాకుండా పదవ పరీక్ష రాయాలని దృఢ సంకల్పంతో చదివి పరీక్ష రాస్తే వాటంతట అవే మంచిర్యాంకులు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిహెచ్ఎస్ పెద్ద ఏడ్గి హై స్కూల్ ఏచ్ ఎం తిరుపతయ్య, ఉపాధ్యాయుల బృందం, గ్రామ సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్, జిపి సెక్రెటరీ రమేష్ , మండల రెడ్‌క్రాస్ చైర్మన్ ఉమాకాంత్ , దాత జ్ఞానేశ్వర్ డోంగ్లే, గ్రామ పెద్దలు, యువజన సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దఎడ్గిలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు వితరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



