– మెడికల్ కాలేజేస్ రీసెర్చ్ కనెక్ట్-2026లో ఈ గుర్తింపు
– మా అంకితభావానికి ప్రతిఫలం : నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ నగరి బీరప్ప
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మెడికల్ కాలేజేెస్ రీసెర్చ్ కనెక్ట్‌ు2026లో నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)కు ప్రతిష్టాత్మకమైన సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారం లభించింది. ఆరోగ్య పరిశోధన విభాగం(డీహెచ్‌ఆర్), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో బుధ, గురువారాల్లో నిర్వహించిన జాతీయ సదస్సులో దేశంలోని 100కుపైగా మెడికల్ కాలేజీలు పాల్గొన్నాయి. మల్టీ-డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ల(ఎమ్‌ఆర్‌యూ) పనితీరును పరిశీలించి, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సంస్థలకు ఈ అవార్డును ప్రదానం చేశారు. నిమ్స్ మల్టీ-డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ చేపట్టిన పరిశోధన కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, శాస్త్రీయ ప్రతిపాదనలు విశేష ప్రశంసలు అందుకున్నాయి. భారత ప్రభుత్వ ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి, ఐసీఎమ్‌ఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ చేతులమీదుగా ఈ అవార్డును నిమ్స్ ప్రొఫెసర్లు డాక్టర్ పద్మజ, డాక్టర్ విజరుకుమార్ అందుకున్నారు. ”దేశ స్థాయిలో మా సంస్థకు లభించిన ఈ గుర్తింపు మా పరిశోధకుల అంకితభావానికి ప్రతిఫలం. భవిష్యత్తులోనూ ఉన్నత ప్రమాణాలతో బయోమెడికల్ పరిశోధనను కొనసాగిస్తాం. దేశ ఆరోగ్యరంగ అభివృద్ధికి నిమ్స్ కట్టుబడి ఉంటుంది. పరిశోధన రంగంలో మరింత ప్రతిష్ట సాధిస్తూ, జాతీయ స్థాయిలో ఆరోగ్య పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో నిమ్స్ కీలక పాత్ర పోషిస్తుంది’ అని హామీనిచ్చారు. నిమ్స్ డీన్ ప్రొఫెసర్ లిజా రాజశేఖర్ ఈ అవార్డు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి గుర్తింపులు సాధించేలా కృషిచేస్తామని హామీనిచ్చారు.
నిమ్స్‌కు ఎక్సలెన్స్ అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



