Friday, June 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోతే పాఠశాలలో అడ్మిషన్లకు విశేష స్పందన..

మోతే పాఠశాలలో అడ్మిషన్లకు విశేష స్పందన..

- Advertisement -

నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్ : బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే ఉపాధ్యాయుల బృందం అడ్మిషన్ల కొరకు నిర్వహించిన కార్యక్రమము నకు విశేష స్పందన లభిస్తుందని ప్రధానోపాధ్యాయులు  వైద్య గణేష్ బుధవారం తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కెసిఆర్ కాలనీ భీమ్గల్,  అక్లూర్ ఓడ్డెర కాలనీలో  బుధవారం నిర్వహించిన బడిబాటలో మోతే పాఠశాలలో చేరిక కొరకు తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్సాహం చూపిస్తున్నారాని, పాఠశాల ప్రగతిని చూసి విద్యార్థుల తల్లి దండ్రులు నుండి ప్రజల నుండి వస్తున్న స్పందన చాలా సంతోషముగా ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పి ఆర్ టి యు వేల్పూర్ మండల ప్రధాన కార్యదర్శి సివి నరసింహారావు , ఉపాధ్యాయులు  గణేష్ మహేందర్ రత్నయ్య, మంచిర్యాల సురేష్ లు తెలిపారు. ఈ విధమైన ప్రజల స్పందన ఉపాధ్యాయులను రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి ప్రోత్సహిస్తుందని ప్రధానోపాధ్యాయులు  తెలిపారు. పాఠశాలను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా వారు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -