Thursday, March 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమితిమీరుతున్న మైక్రోఫైనాన్స్‌ ఆగడాలు

మితిమీరుతున్న మైక్రోఫైనాన్స్‌ ఆగడాలు

- Advertisement -

– కుటుంబాన్ని ఇంటి నుంచి గెంటేసి తాళం
– మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం యావపూర్‌లో ఘటన
– గతంలో వేధింపులకు మహిళ ఆత్మహత్య
నవతెలంగాణ-తూప్రాన్‌/మనోహరాబాద్‌

మైక్రోఫైనాన్స్‌ ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. ఫైనాన్స్‌ వేధింపులకు గతంలో ఓ మహిళ ఆత్మహత్య పాల్పడిన సంఘటన జరిగింది. అది మరువకముందే ఓ కుటుంబాన్ని ఇంటి నుంచి గెంటేసి ఇంటికి తాళం వేశారు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం యావపూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. యావపూర్‌ గ్రామానికి చెందిన ఇద్దరు అన్న తమ్ముళ్లు నివాస్‌ ఫైనాన్స్‌లో ఇద్దరూ కలిసి రూ.10 లక్షలు లోన్‌ తీసుకున్నారు. కాగా ఒకరి కొడుకు అనారోగ్యంతో చనిపోగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అప్పు కట్టలేకపోయారు. దాంతో ఫైనాన్స్‌ ప్రతినిధులు బుధవారం ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను లోన్‌ కట్టాలని కోరారు. దాంతో కుటుంబ సభ్యులు లోన్‌ను కచ్చితంగా కడతామని, కొంత సమయం ఇవ్వాలని వేడుకున్నారు. అయినా ఫైనాన్స్‌ ప్రతినిధులు వినిపించుకోకుండా ఇంట్లో ఉన్న మహిళలను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేశారు. అప్పు కడతామన్నా వినకుండా ఇంటి నుంచి గెంటేయడంతో మహిళలు కన్నీరుమున్నీరుగా విలపించారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు, కుటుంబ సభ్యులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -