ఓఆర్‌ఆర్‌పై పల్టీలు కొట్టి కిందకు పడిపోయిన కారు
నలుగురికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-పటాన్‌చెరు
ఓఆర్‌ఆర్‌పై అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పల్టీలుకొట్టి రోడ్డు పక్కన గుంతలో పడిపోయింది. దాంతో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం సాయంత్రం జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బౌరంపేట సింహపురి కాలనీకి చెందిన హరిప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌లోని జూపార్క్‌కు వెళ్లారు.
సాయంత్రం తిరుగు ప్రయాణం లో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం ఔటర్ రింగ్‌రోడ్డు ఎక్కారు. అత్యంత వేగంతో సర్వీస్ రోడ్డుపై అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హరిప్రసాద్ భార్య మౌనిక(36), స్నేహితుడు నవీన్(30) అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవింగ్ చేస్తున్న హరిప్రసాద్‌తో పాటు శ్రీహర్ష, అమృత, శుశ్రుత, ఏడాదిన్నర బాబు అగస్త్య తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయ పడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం పటాన్‌చెరులోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. పటాన్‌చెరు సీఐ వినాయక్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అతివేగం.. రెండు నిండు ప్రాణాలు బలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



