నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని హంగర్గ గ్రామంలో శుక్రవారం గంజాయి సాగు చేస్తున్న వ్యవసాయ భూమిలోని రైతుకు ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ బృందంతో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్న విషయం పాఠకులకు విధితమే. ఇట్టి విషయాన్ని నవతెలంగాణ పత్రికలో రాసినందుకు పత్రికా విలేఖరికి బిచ్కుంద ఎక్సైజ్ సత్యనారాయణ ఫోన్ చేసి నీ సంగతి ఏదో చూస్తా , నువ్వు బిచ్కుంద వరకు రాగలుగుతావా.. వస్తే నీ పని పడతానని బెదిరింపులకు పాల్పడుతూ ఫోన్ ద్వారా పత్రికా విలేఖరితో మాట్లాడడం జరిగింది. అసలు ఏమైంది అని విలేకరి ప్రశ్నించగా.? వార్త బాగానే రాశావు, బాగుందని, పొగుడుతూనే వ్వంగ్యంగా మాట్లాడం మొదలుపెట్టి దురుసుగా మాట్లాడారు. నీవు ఎక్కడున్నావు, ఒకసారి కనిపించు అని, నీ మీద కేసు పెడతా అని పత్రిక విలేఖరికి ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. సార్ మర్యాదగా మాట్లాడండి, మంచి పద్ధతిగా ఉండండి, దురుసుగా మాట్లాడితే బాగుండదని విలేకరి పదే పదే చెప్పినా.. పట్టించుకోకుండా కోపంలో దురుసుగా మాట్లాడుతూ ఫోన్ కట్ చేశాడని తెలిపారు.
విలేకరిని బెదిరిస్తున్న ఎక్సైజ్ సీఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES