Sunday, February 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి

- Advertisement -


తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి హాస్పిటల్ లో మృతి
నవతెలంగాణ – నిజామాబాద్

నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్య చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం మృతి చెందారు. ఆమె మరణం పట్ల నిమ్స్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
నిజామాబాద్ నగరంలో తనిఖీల సమయంలో గంజాయి తరలిస్తున్న ముఠా.. కారుతో డీ కొట్టడంతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జనవరి 25న నిమ్స్ లో చేర్చారు. వివిధ విభాగాల నిపుణుల ద్వారా అవసరమైన అన్ని అత్యాధునిక వైద్య సేవలు, లైఫ్ సపోర్ట్ చికిత్సలు అందించారు. వైద్యులు అత్యంత శ్రద్ధతో నిరంతర వైద్య ప్రయత్నాలు చేసినప్పటికీ, సౌమ్య ను కాపాడలేక పోయినట్టు వైద్యులు తెలిపారు. శనివారం రాత్రి 9:41 గంటలకు మృతిచెందారు. ఆమె మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్టు నిమ్స్ వైద్యులు తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -