Sunday, October 12, 2025
E-PAPER
Homeఆదిలాబాద్స్పెషల్ ఆఫీసర్ నియామకంపై హర్షం...

స్పెషల్ ఆఫీసర్ నియామకంపై హర్షం…

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్: బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ ను  బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానముకు  స్పెషల్ ఆఫీసర్ గా నియమించటం పై బాసర మాజీ సర్పంచ్ దయాల లక్ష్మణ్ రావు ఆదివారం ఒక్క ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఐఏఎస్అధికారి నియమించాలన్న ఎన్నో ఏండ్ల కల నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో నెరవేరిందని పేర్కొన్నారు. ఇంకా నుండి బాసర ఆలయంలో అవకతవకలు జరగవు అన్నారు.మరింత ఆలయం అభివృద్ధి చెందుతుందని తన ఆశాభావం ను వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి  కృషి తో ఆలయం అభివృద్ధి కి  బాటలు పట్టే అవకాశం ఉందని ఆయన ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కి  ధన్యవాదములు తెలిపారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -