Tuesday, February 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయించండి

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయించండి

- Advertisement -

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి వినతి
నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఉత్తీర్ణత తప్పనిసరి ఉందనీ, ఆ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో సోమవారం పీఆర్టీయూటీఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్‌రెడ్డి, సుంకరి బిక్షంగౌడ్‌లతో కలిసి శ్రీపాల్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు కూడా టెట్‌ నిబంధనను తప్పనిసరి చేస్తూ తీర్పునిచ్చిందని తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పూందిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు వేర్వేరు తీర్పుల్లో టెట్‌ నిబంధనను తప్పనిసరి చేయడంతో సమస్య ఏర్పడిందని వివరించారు.ఈ సమస్యను అధిగమించడానికి న్యాయపరమైన సలహా తీసుకుని ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో పీఆర్టీయూటీఎస్‌ నాయకులు సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మిర్యాల సతీశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -