ట్రంప్‌నకు జిన్‌పింగ్ హెచ్చరిక
బీజింగ్/వాషింగ్టన్ : తైవాన్‌కు ఆయుధాల సరఫరా విషయంలో వివేకంతో వ్యవహరించాల్సిందిగా చైనా నేత జిన్‌పింగ్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించారు. రెండు దేశాల అధినేతల మధ్య బుధవారం టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఆ వివరాలను చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన రూపంలో తెలియజేసింది. ‘చైనా-అమెరికా సంబంధాలలో తైవాన్ అత్యంత ముఖ్యమైన విషయమని జిన్‌పింగ్ నొక్కి చెప్పారు. చైనా తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను విధిగా పరిరక్షించుకోవాల్సి ఉంది. తైవాన్ వేరుపడడాన్ని ఎన్నటికీ అనుమతించదు. కాబట్టి తైవాన్‌కు ఆయుధ సరఫరాల విషయంలో అమెరికా వివేకంతో, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది’ అని ఆ ప్రకటన వివరించింది.
ట్రంప్ ఏమన్నారంటే…
కాగా తైవాన్ భవిష్యత్తు సహా అనేక అంశాలపై జిన్‌పింగ్‌తో చర్చించానని ట్రంప్ తెలిపారు. జిన్‌పింగ్‌తో సంభాషణ అద్భుతంగా జరిగిందని, అన్ని విషయాలపై కూలంకషంగా చర్చించామని ఆయన ట్రూత్ సోషల్‌లో వివరించారు. ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న యుద్ధం, ఇరాన్‌తో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అమెరికా నుంచి చమురు-గ్యాస్ కొనుగోళ్లు కూడా ప్రస్తావనకు వచ్చాయని చెప్పారు. ఏప్రిల్‌లో చైనాలో పర్యటించాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ప్రస్తుత సీజన్‌లో అమెరికా నుంచి 20 మెట్రిక్ టన్నుల సోయాబీన్ కొనుగోలును చైనా పరిశీలిస్తోందని అన్నారు.



